Education-Article
తెలంగాణ విద్యార్థులకు జాతీయ స్థాయి గుర్తింపు!

యంగ్‌ అచీవర్స్‌’లో రాణించిన నలుగురు విద్యార్థినులు

హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ర్టానికి చెందిన నలుగురు పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల విభాగం, కేంద్ర విద్యా విభాగం సోమవారం ‘యంగ్‌ అచీవర్స్‌’ గుర్తింపు పోటీని వర్చువల్‌ విధానంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. కేంద్ర విద్యారంగ నిపుణులు నిర్వహించిన ఈ సెమినార్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.


వీరిలో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని కుర జడ్పీ ఎస్‌ఎ్‌సలో 9వ తరగతి చదువుతున్న శ్రీజ, యాదాద్రి జిల్లా ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదువుతున్న అనిత, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల కేజీబీవీలో చదువుతున్న కె. సోను, హైదరబాద్‌ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎ్‌సలో 8వ తరగతి చదువుతున్న కశి్‌షసింగ్‌ ఉన్నారు. వీరిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన అభినందించారు. 


Tags :