Education-Article
ఎంబీబీఎస్‌ పరీక్షల వాయిదా కుదరదుతేల్చేసిన ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు తేల్చిచెప్పారు. రెండే ళ్ల నుంచి రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నా ఎప్పుడూ పరీక్షలు వాయి దా వేయలేదని గుర్తు చేస్తున్నారు. వర్సిటీలో 30శాతం ఉద్యోగులతోనే పాలన సాగిస్తున్నామని, ఇలాంటి సమయంలో వాయిదా వేస్తే పరీక్షలను రీషెడ్యూల్‌ చేయడానికి అనేక ఇబ్బందులు వస్తాయంటున్నారు. ఎంబీబీఎ్‌సతో పాటు ఆ తర్వాత నిర్వహించాల్సిన మిగిలిన పరీక్షలన్నీ కూడా రీషెడ్యూల్‌ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. కాగా, పరీక్షల నిర్వహణపై మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లకు వర్సిటీ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది. 

  

Tags :