Education-Article
96% గెజిటెడ్‌ హెచ్‌ఎంల కేటాయింపులు పూర్తి

గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల్లో 96 శాతం మందికి సంబంధించిన నూతన స్థానిక క్యాడర్‌ కేటాయింపు పూర్తయింది. అయితే.. మిగిలిన 4 శాతం ప్రధానోపాధ్యాయుల కేటాయింపుల్లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను తొలగించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి రాజ గంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో దొర్లిన తప్పులను సవరించాలని సూచించారు. అలాగే సీనియారిటీ జాబితాలో తప్పులను సరిచేయాలని కోరారు. ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువును పొడిగించారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24తో గడువు ముగియనుంది. అయితే.. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అడ్మిషన్ల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టు ఓపెన్‌ స్కూల్‌ సొసైౖటీ డైరెక్టర్‌ సోమిరెడ్డి తెలిపారు.

Tags :