Education-Article
ఎన్‌జీరంగా వర్సిటీలో ప్రవేశాలు

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ - డిగ్రీ కోర్సుల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్స్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు.


స్పాట్‌ కౌన్సెలింగ్‌: నాలుగేళ్ల వ్యవధిగల బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) కోర్సులో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్‌/ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. బాపట్లలోని డా.ఎన్‌టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లో 13, మడకశిరలోని కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లో 19 చొప్పున మొత్తం 32 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ ప్రతిభ, ఏపీ ఈఏపీసెట్‌ 2021 ర్యాంక్‌, సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు  అన్ని కేటగిరీల అభ్యర్థులు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌ రోజునే కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.   
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ ప్రధాన సబెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు 22; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

కోర్సు ఫీజు: రూ.36,695
రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1,650; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.825
కౌన్సెలింగ్‌ తేదీ: జనవరి 22
కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఏపీ ఈఏపీసెట్‌ 2021 హాల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డు; ఆరోతరగతి నుంచి ఇంటర్‌ స్థాయి వరకు స్టడీ సర్టిఫికెట్‌లు/ బోనఫైడ్‌; ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌; కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు; మూడు ఫొటోలు.
వేదిక: ఆడిటోరియం, ఆర్‌ఏఆర్‌ఎస్‌, లాం.

ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు: వర్సిటీ ఆధ్వర్యంలోని దూరవిద్య కేంద్రం వీటిని నిర్వహిస్తోంది. చిరుధాన్యాల సాగు, పుట్టగొడుగుల పెంపకం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి రెండు నెలలు. గ్రామీణ రైతులు, మహిళలు, వ్యవసాయంపై ఆసక్తి గల యువత, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ కోర్సులు ఉపయుక్తంగా ఉంటాయి.

అర్హత: తెలుగు రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం ఆరోతగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు. అభ్యర్థులకు కంప్యూటర్‌/ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉండాలి. 

శిక్షణ: వారానికి ఒక రోజు ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌ వ్యవధి రెండు గంటలు. వీటికి అటెండెన్స్‌ తప్పనిసరి. ఈ సెషన్స్‌లో సంబంధిత అంశాలను వివరించడంతోపాటు క్విజ్‌ ప్రోగ్రామ్‌లు, అసైన్‌మెంట్స్‌ నిర్వహిస్తారు.  కోర్సు చివరలో ఎగ్జామ్‌ ఉంటుంది. ఇందులో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారికి మాత్రమే సర్టిఫికెట్‌లు ప్రదానం చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.1200

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని పూర్తిగా నింపి డీడీ జతచేసి కింది చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జనవరి 20

చిరునామా: సార్వత్రిక - దూరవిద్య కేంద్రం, డీన్‌ కార్యాలయం, పరిపాలన భవనం, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు - 522034

కోర్సులు ప్రారంభం: జనవరి 30 నుంచి

ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్స్‌: ఎన్‌ఆర్‌ఐ/ ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి థర్డ్‌/ ఫైనల్‌ నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా బీఎస్సీ ఆనర్స్‌(అగ్రికల్చర్‌/ కమ్యూనిటీ సైన్స్‌), బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/ ఫుడ్‌ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్‌ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌/ బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు బయాలజీ, బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)కు మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జె క్టుగా చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కు లు తప్పనిసరి. డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొన్న దరఖాస్తు ఫారాన్ని నింపి ఇంటర్‌, పదోతరగతి మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఎన్‌ఆర్‌ఐ వీసా - పాస్‌పోర్ట్‌ - ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కేటగిరీ అభ్యర్థులు తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌, స్పాన్సరర్‌ ధ్రువీకరణ పత్రం కూడా సబ్మిట్‌ చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31

మెరిట్‌ లిస్ట్‌ విడుదల: ఫిబ్రవరి 2

థర్డ్‌/ ఫైనల్‌ కౌన్సెలింగ్‌: ఫిబ్రవరి 4

వేదిక: ఆడిటోరియం, ఆర్‌ఏఆర్‌ఎస్‌, లాం, గుంటూరు.

చిరునామా: రిజిస్ట్రార్‌, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, లాం, గుంటూరు - 522034

వెబ్‌సైట్‌: angrau.ac.in

Tags :