Education-Article
క్రీడాపాఠశాలల్లో కోచ్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజన క్రీడాపాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన ఖోఖో, కబడ్డీ, లీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, అథ్లెటిక్స్‌లలో విభాగాల్లో కోచ్‌లను ఎంపిక చేయనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, ఆదిలాబాద్‌ జిల్లా జాతర్ల, కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని, కొత్తగూడెం జిల్లా కాచనపల్లి, ఆసిఫాబాద్‌ క్రీడాపాఠశాలల్లో ఖాళీలున్నాయని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం tstribalwelfare.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరారు.

Tags :