జగిత్యాల టౌన్, జనవరి 18: కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై సీఎంకు స్పష్టత లేదన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే ముందు బోధన, సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. గత ఐదేళ్లలో టెట్ నిర్వహించని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆరోపించారు.