కొవిడ్‌తో ముందస్తు జాగ్రత్త కోసం విద్యాసంస్థలను మూసేసిన కేసీఆర్.. బార్లు, పబ్‌ల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పబ్బులు, బార్లల్లో కొవిడ్ మరణాలు చోటు చేసుకుంటున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించడం లేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్, విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, అందుకే కొవిడ్‌పై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనలేదని విమర్శించారు. దళితబంధు పథకం నిజాయితీగా అమలు చేస్తే బాగుంటుందని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత ఈ పథకం గురించి కేసీఆర్ మాట్లాడటం లేదన్నారు.