Education-Article
విద్యారంగ సమస్యల పరష్కారానికి కృషి

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి


ఆసిఫాబాద్‌, జనవరి 17: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. సోమవారం జడ్పీకార్యాలయంలో టీయూటీ ఎఫ్‌ క్యాంలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యాభివృద్ధి కోసం కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా టీయూటీ ఎఫ్‌ నాయకులు సమస్యలు పరిష్కరించాలని జడ్పీ చైర్‌పర్సన్‌కు విన్నవించారు. జిల్లాలోని కొత్తగా ఏర్ప డిన చింతలమానేపల్లి, లింగాపూర్‌, పెంచికలపేట మండలకేంద్రాల్లో ఎమ్మార్సీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, జైనూరు, లింగాపూర్‌, సిర్పూర్‌(యూ) మండలాల ఉద్యోగుల సౌకార్యర్థం జైనూరు మండల కేంద్రంలో ఎస్టీయూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయా లని, ప్రభుత్వడైట్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లాఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంతకుమార్‌, సదాశివ్‌, శ్రావణ్‌కుమార్‌, భానుప్రకాష్‌, వెంకట్రావు, శ్రీనివాస్‌, జలపతి, ప్రవీణ్‌, ప్రకాష్‌, నాగేశ్వర్‌, మధుకర్‌, ధన్‌రాజ్‌ పాల్గొన్నారు. 
Tags :