Education-Article
JN TATA LOAN స్కాలర్‌షిప్‌

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకొనే భారతీయ అభ్యర్థుల కోసం ఉద్దేశించిన ‘జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ లోన్‌ స్కాలర్‌షిప్‌’ నోటిఫికేషన్‌ వెలువడింది. ఏ విభాగంలోనైనా ఫుల్‌ టైం పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌, రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కోర్సుల్లో చేరదలచుకొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశం పొందిన విదేశీ యూనివర్సిటీ వివరాలను నిర్దేశిత సమయంలోపు ఈమెయిల్‌ ద్వారా తెలపాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌/టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ తప్పనిసరి. అభ్యర్థులు సబ్మిట్‌ చేసే ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ)’కు ప్రాధాన్యం ఉంటుంది. ఎంచుకొన్న కోర్సు వ్యవధి రెండేళ్లు ఉండాలి. ఇప్పటికే విదేశాల్లో రెండో ఏడాది కోర్సు చదువుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు జూన్‌ 30 నాటికి 45 ఏళ్లు మించకూడదు. సెమినార్‌లు, కాన్ఫరెన్స్‌లు, ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లు, వర్క్‌షా్‌పలు, పేపర్‌ ప్రెజంటేషన్‌ల కోసం విదేశాలకు వెళ్లేవారు; డిగ్రీ స్థాయి కోర్సులు ఎంచుకొన్నవారు; దూరవిద్య విధానంలో చదివినవారు దరఖాస్తుకు అనర్హులు. ఇప్పటికే లోన్‌ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని పూర్తిగా చెల్లించినవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా స్ర్కీనింగ్‌ చేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. వీరికి మాత్రమే థింకింగ్‌ స్కిల్స్‌ అసెస్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. 

లోన్‌ స్కాలర్‌షిప్‌: అభ్యర్థి ఎంచుకొన్న కోర్సును అనుసరించి రూ.1,00,000 నుంచి రూ.10,00,000ల మధ్య లోన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ట్రావెల్‌ అసిస్టెన్స్‌ కింద గరిష్ఠంగా రూ.50,000 ఇస్తారు. కోర్సు సమయంలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా గిఫ్ట్‌ అవార్డ్‌ కింద రూ.2,00,000 నుంచి రూ.7,50,000 వరకు చెల్లిస్తారు. కోర్సులో చేరిన మూడో ఏడాది నుంచి ఏడో సంవత్సరంలోపు అభ్యర్థులు ఈ లోన్‌ స్కాలర్‌షి్‌పను అయిదు ఇన్‌స్టాల్‌మెంట్‌లలో తిరిగి చెల్లించాలి. ఈ మేరకు సంబంధిత ట్రస్టీతో లీగల్‌గా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 21

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28

ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: ఏప్రిల్‌ 17

ఈ మెయిల్‌: [email protected]

వెబ్‌సైట్‌: jntataendowment.org

Tags :