అర్హత వివరాలు: స్పెషలైజేషన్‌ను అనుసరించి మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్/ సీ అండ్ ఐ/ పవర్ ఇంజనీరింగ్/ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ/ ఐటీ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ, టెలిఫోన్/ ఆన్లైన్ ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అకడమిక్ ప్రతిభకు 90 శాతం, ఇంటర్వ్యూకి 10 శాతం వెయిటేజీ ఇస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 11
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఫిబ్రవరి 14
ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 21
మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్: ఫిబ్రవరి 28
వెబ్సైట్: npti.gov.in