Education-Article
ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్‌ ఎగ్జామ్‌‌కు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) నిర్వహించే పరీక్షల్లో అత్యంత ఆదరణ కలిగిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సిజిఎల్‌ఈ)కు నోటిఫికేషన్‌ వెలువడింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఆఫీసర్ల నియామకం కోసం ఎస్‌ఎస్‌సి ఏటా సిజిఎల్‌  పరీక్షను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు/సంస్థల్లోని  దాదాపు 22 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా  పోస్టుల వారీగా  ఖాళీల వివరాలను మాత్రం  ఫైనల్‌ రిజల్ట్స్‌కు కనీసం నెల రోజుల ముందు వెల్లడిస్తారు.

పోస్టులు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, అసిస్టెంట్‌/సూపరింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్‌(సెంట్రల్‌ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్‌(ప్రివెంటివ్‌ ఆఫీసర్‌), ఇన్‌స్పెక్టర్‌(ఎగ్జామినర్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్స్‌, డివిజనల్‌ అకౌంటెంట్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌/యూడీసీ, టాక్స్‌ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ తదితరాలు.

అర్హతలు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ లేదా కంపెనీ సెక్రటరీ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్‌)/మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్‌ స్టాటిస్టికల్‌ పోస్టుకు అభ్యర్థులు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, ఇంటర్మీడియట్‌(10+2)లో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: పోస్టులను అనుసరించి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నాలుగో దశ(టయర్‌-4)ను కొన్ని పోస్టులకు మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులందరూ మూడు దశల విధానాన్ని పాటించాల్సిందే. 

టయర్‌-1 పరీక్ష: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్త నాలుగు విభాగాలుంటాయి. అవి..జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌.  ప్రతి విభాగం నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.50 మార్కు కట్‌ అవుతుంది.

టయర్‌-2 పరీక్ష: మొత్తం 400 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నల చొప్పున మొత్తం 400 ప్రశ్నలు వస్తాయి. అవి...క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, స్టాటిస్టిక్స్‌, జనరల్‌ స్టడీస్‌(ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌). నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కట్‌ అవుతుంది.

టయర్‌-3 పరీక్ష: ఇది పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో ఉంటుంది. డిస్ర్కిప్టివ్‌ విధానంలో పరీక్ష రాయాలి. మొత్తం మార్కులు 100. పరీక్ష వ్యవధి ఒక గంట.

టయర్‌-4 పరీక్ష: దీనిలో భాగంగా కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(సీపీటీ), డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌(డీఈఎస్‌టీ) నిర్వహిస్తారు.

ప్రిపరేషన్‌ ప్లాన్‌

ఇంటెలిజెన్స్‌-రీజనింగ్‌: ఈ విభాగం కోసం వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇందుకు కోడింగ్‌, డికోడింగ్‌, నెంబర్‌ సిరీస్‌, ఎనాలజీ, క్లాసిఫికేషన్‌, సిలాజిజమ్స్‌ మ్యాట్రిక్స్‌ కోడింగ్‌, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి వాటిపై పట్టు సాధించాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో చరిత్ర, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం, కరెంట్‌ ఆఫైర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. దీని కోసం  దినపత్రికలు, ఎన్‌సిఈఆర్‌టి బుక్స్‌, మనోరమ ఇయర్‌ బుక్‌ ఫాలో కావాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఇందులో శాతాలు, స్క్వేర్‌రూట్స్‌, సరాసరి, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం వంటి అంశాలే కాకుండా జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ టాపిక్స్‌ను కూడా ప్రిపేర్‌ కావాలి. ఇందుకోసం 10వ తరగతి వరకు గల మేథ్స్‌ పుస్తకాల్లోని సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి.

ఇంగ్లీష్‌: ఇందులో  కాంప్రెహెన్షన్‌, ఎర్రర్‌ డిటెక్షన్స్‌, సినానిమ్స్‌, అంటానిమ్స్‌, కరెక్ట్‌ స్పెల్లింగ్‌ వంటి వాటి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ స్కోర్‌ సాధించాలంటే వొకాబులరీపై ఎక్కువగా దృష్టి సారించాలి. 

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌: కడప, కర్నూలు, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌


ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

టయర్‌-1 పరీక్ష: ఏప్రిల్‌ 2022

టయర్‌-2 పరీక్ష: తరవాత  వెల్లడిస్తారు

వెబ్‌సైట్‌: https://ssc. nic.in/

Tags :