Education-Article
ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో ఎంఎస్‌ చేయాలంటే ఎలా?

ఎలక్ట్రానిక్స్‌తో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీలో విఎల్‌ఎస్‌ఐ లేదా ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో ఎంఎస్‌ చేయాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలు తెలుపగలరు?

- సంజన, హైదరాబాద్‌


నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, నానో ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఎమ్మెస్సీని అందిస్తోంది. ఈ యూనివర్సిటీలో అందించే స్కాలర్‌షిప్స్‌ అన్నీ కూడా దాదాపుగా కోర్సుల పరిశోధనలకే ఎక్కువగా ఉంటాయి. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌ కోర్సు ఉంది. ఈ కోర్సు చేసినవారు మెషిన్‌లెర్నింగ్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ డెవలపర్‌, రీసెర్చ్‌ సైంటిస్ట్‌, బిగ్‌డేటా ఇంజనీర్‌ తదితరాలుగా పనిచేయవచ్చు. గేట్‌, జిఆర్‌ఇ రెండు స్కోర్లను సింగపూర్‌ యూనివర్సిటీలు అంగీకరిస్తాయి. 20 నుంచి 25 లక్షల ఖర్చుతో కోర్సు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌కు అయితే యూకె బాగుంటుంది.  యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌, నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌, కింగ్‌స్టన్‌ యూనివర్సిటీ, ససెక్స్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌ల్లో ఈ కోర్సు బాగుంటుంది. మీ బడ్జెట్‌, స్కోరును బట్టి యూనివర్సిటీలను ఎంచుకోండి. 

-గోవర్ధనం కిరణ్‌కుమార్‌

Tags :