ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌తో బీటెక్ పూర్తిచేశాను. ప్రస్తుతం సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు చేస్తున్నాను. మరోవైపు జావా, పైథాన్లాంటివి కూడా నేర్చుకుంటున్నాను. టెస్ట్ ఇంజనీర్లకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుంది. దీనిలో ఉద్యోగం వస్తుందా? తరవాత డెవలపింగ్ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నాను సలహా ఇవ్వగలరు?
- ప్రియ రాజ్, సికింద్రాబాద్
ఐటీ ఇండస్ట్రీలో మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. భవిష్యత్తులో దేనికి డిమాండ్ ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. టెస్టింగ్ అయినా, డెవలప్మెంట్ అయినా మార్కెట్, కెరీర్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటూ వెళ్లాల్సిందే. మీరు వేగంగా నేర్చుకోగలిగి, ఉద్యోగానికి అవసరమైన డెలివరబుల్స్ను వేగంగా అందించగలిగేవారికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పోలిస్తే టెస్టింగ్ కొంత భిన్నంగా ఉంటుంది. టెస్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆసక్తి ఉంటే డెవలపర్‌గా మారడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు చేసే ఆన్లైన్ కోర్సులు ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. దానికి సంబంధించిన ప్రాజెక్టులు సైడుగా ఏమైనా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. టెస్టింగ్లోని మాన్యువల్ రిప్రజెంటేషన్ వర్క్ అంతా కూడా ఆటోమేటెడ్‌గా మారుతోంది. అందుకే టెస్టర్లు కూడా కొంత టెస్టింగ్ తరహా ప్రోగ్రామ్స్‌ని నేర్చుకోవాల్సి వస్తోంది. వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వీరు కూడా అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండాల్సిందే.