భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం)... ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 07
పోస్టులు: జూనియర్ కన్సల్టెంట్:05; కన్సల్టెంట్:02
విభాగాలు: రిసైలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ లెర్నింగ్ డివిజన్, ట్రెయినింగ్, హాస్టల్ మేనేజ్మెంట్, ట్రెయినింగ్ కో ఆర్డినేటర్, హాస్టల్ సపోర్ట్
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి
వయసు: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: జనవరి 21
ఈమెయిల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19
వెబ్సైట్: https://nidm.gov.in/