బిహార్లోని డా.రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆర్పీసీఏయూ)-సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వసతి సౌకర్యం ఉంది.
కోర్సులు: మష్రూమ్ కల్టివేషన్ టెక్నాలజీ, సుగర్కేన్ కల్టివేషన్ అసిస్టెంట్, ఫిష్ హేచరీ అసిస్టెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదానిలో ఫౌండేషన్, బేసిక్, అడ్వాన్స్డ్ లెవెల్ కోర్సులు ఉన్నాయి. కోర్సు వ్యవధి ఏడాది. రెండు సెమెస్టర్లు ఉంటాయి.
అర్హత: ఫౌండేషన్ లెవెల్ కోర్సులకు ఎనిమిదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. బేసిక్ లెవెల్ కోర్సులకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అడ్వాన్స్డ్ లెవెల్ కోర్సులకు ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సుగర్కేన్ కల్టివేషన్ అసిస్టెంట్ కోర్సుకు పురుషులు మాత్రమే అర్హులు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250
ఈ మెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20
ఈ మెయిల్: [email protected]
వెబ్సైట్: www.rpcau.ac.in