Education-Article
ఐఐఎఫ్‌ఎంలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్‌ఎం) - పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎఫ్‌ఎం), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సస్టయినబిలిటీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎస్‌ఎం) ప్రోగ్రామ్‌లు ప్రకటించారు. ఇవి రెండేళ్ల వ్యవధిగల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌లు. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. వీటిలో క్లాస్‌ రూం టీచింగ్‌, స్ట్రక్చర్డ్‌ ఫీల్డ్‌ వర్క్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. పెడగాగి టెక్నిక్స్‌, కేస్‌ మెథడ్‌, రోల్‌ ప్లే, సిమ్యులేషన్‌ గేమ్స్‌, సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటాయి. జాతీయ పరీక్ష స్కోర్‌, అకడమిక్‌ ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పీజీ డిప్లొమా ఇన్‌ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్‌ 
స్పెషలైజేషన్‌లు: డెవల్‌పమెంట్‌ మేనేజ్‌మెంట్‌, కన్జర్వేషన్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌
ప్రోగ్రామ్‌ వివరాలు: మొత్తం అయిదు టర్మ్‌లు ఉంటాయి. మొదటి టర్మ్‌లో క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, మేనేజీరియల్‌ కంప్యూటింగ్‌, అకౌంటింగ్‌ ఫర్‌ మేనేజర్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫౌండేషన్‌ ఫర్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సొసైటీ అండ్‌ పాలిటీ పేపర్‌లు ఉంటాయి. రెండో టర్మ్‌లో ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మైక్రో ఎకనామిక్‌ అనాలసిస్‌, అకౌంటింగ్‌ ఫర్‌ మేనేజర్స్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, క్లయిమేట్‌ ఛేంజ్‌ అండ్‌ మిటిగేషన్‌ పేపర్‌లు ఉంటాయి. మూడో టర్మ్‌లో ఫౌండేషన్స్‌ ఆఫ్‌ సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌, మేక్రో ఎకనామిక్‌ పాలసీ అండ్‌ అనాలసిస్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, రీసెర్చ్‌ మెథడ్స్‌ అండ్‌ బిజినెస్‌ అనాలసిస్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ పేపర్‌లు ఉంటాయి. నాలుగు, అయిదు టర్మ్‌లలో ఎలక్టివ్‌ పేపర్‌లు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు, కోర్‌ స్కిల్స్‌ అంశాలు ఉంటాయి.

పీజీ డిప్లొమా ఇన్‌ సస్టయినబిలిటీ మేనేజ్‌మెంట్‌

మొదటి టర్మ్‌లో ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ సస్టయినబిలిటీ, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడ్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మేనేజరియల్‌ ఎకనామిక్స్‌ పేపర్‌లో ఉంటాయి. రెండో టర్మ్‌లో డెసిషన్‌ మెథడ్స్‌, గ్రీన్‌ మార్కెటింగ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ బిజినెస్‌ ఎథిక్స్‌, గవర్నెన్స్‌ - పాలసీ - లీగల్‌ ఇష్యూస్‌ ఇన్‌ సస్టయినబిలిటీ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, సిస్టమ్స్‌ - డిజైన్‌ థింకింగ్‌ ఇన్‌ సస్టయినబిలిటీ, మెటీరియలిటీ అసె్‌సమెంట్‌ పేపర్‌లు ఉంటాయి. మూడో టర్మ్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ అండ్‌ గ్రీన్‌ అకౌంటింగ్‌, గ్రీన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ సర్టిఫికేషన్‌ అండ్‌ ఆడిట్స్‌ ఫర్‌ సస్టయినబిలిటీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌ ఫర్‌ డిజైనింగ్‌ సస్టయినబుల్‌ సొల్యూషన్స్‌, క్లయిమేట్‌ ఛేంజ్‌ - సస్టయినబుల్‌ ఎనర్జీ అండ్‌ కార్బన్‌ మేనేజ్‌మెంట్‌, సీఎ్‌సఆర్‌ అండ్‌ సస్టయినబిలిటీ రిపోర్టింగ్‌, కన్జూమర్‌ బిహేవియర్‌ పేపర్‌లు ఉంటాయి. నాలుగో టర్మ్‌లో మెజరింగ్‌ సస్టయినబిలిటీ అండ్‌ అలైనింగ్‌ ఎస్‌డీజీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఫైనాన్స్‌ అండ్‌ సస్టయినబుల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పేపర్‌లతోపాటు ఎలక్టివ్‌ కోర్సులు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. అయిదో టర్మ్‌లో కంపల్సరీ కోర్సులతోపాటు సస్టయినబుల్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, లీడర్‌షిప్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌ పేపర్‌లు; ఎలక్టివ్‌ కోర్సులు, ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సబ్మిషన్‌ ఉంటాయి. 

అర్హత వివరాలు: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022 అర్హత తప్పనిసరి.


ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
చివరి తేదీ: ఫిబ్రవరి 10    
వెబ్‌సైట్‌: iifm.ac.in
Tags :