హైదరాబాద్లోని తెలంగాణ సమగ్ర శిక్షణ పథకానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెషనల్, మేనేజర్(మీడియా అండ్ డాక్యుమెంటేషన్), ఫైనాన్స్ అసిస్టెంట్, టెక్నికల్ సివిల్ ఇంజనీర్ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్ సీఏ, సీఏ/సీఎంఏ/ఎంకామ్/ఎంబీఏ(ఫైనాన్స్), సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. తెలంగాణకు చెందిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. తెలుగులో రాయడం, చదవడం తెలిసి ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 02
వెబ్సైట్: https://www.cgg.gov.in/careers/