రోహ్తక్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) - డాక్టోరల్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (డీపీఎం)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది నాలుగేళ్ల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్.
అర్హత: ఏదేని స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు. డిగ్రీతోపాటు సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్/ ఎల్ఎల్బీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉన్నవారు; అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. వీరు డిసెంబరు 31 నాటికి పీజీ సర్టిఫికెట్, మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాలి. క్యాట్/ జీఆర్ఈ/ జీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. లేదంటే కామర్స్, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మేథమెటికల్ సైన్సెస్, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విభాగాల్లో యూజీసీ నెట్ అర్హత పొంది ఉండాలి.
ఫెలోషిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.30,000; చివరి రెండేళ్లు నెలకు రూ.35,000ల ఫెలోషిప్ ఇస్తారు. రెండో ఏడాది నెలకు రూ.10,000; మూడో ఏడాది నుంచి నెలకు రూ.15,000ల మెరిట్ ఫెలోషిప్ ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద రూ.1,85,000 చెల్లిస్తారు.
ముఖ్య సమాచారం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31
ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 15, 16
ఫలితాలు విడుదల: ఏప్రిల్ 25
వెబ్సైట్: iimrohtak.ac.in