ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్)-మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రెండేళ్ల రెగ్యులర్ ప్రోగ్రామ్. ఇందులో ఆరు ట్రైమెస్టర్లు ఉంటాయి. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.
ప్రోగ్రామ్ వివరాలు:
మొదటి ఏడాది అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అనాలసిస్, ఎకనామిక్స్ ఫర్ డెసిషన్ మేకింగ్, డేటా అనలిటిక్స్ అండ్ క్యూటీ ఫోర్‌క్యాస్టింగ్ ఫర్ ఫైనాన్స్, కంప్యూటర్స్ ఫర్ బిజినెస్ లీడర్స్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ బిజినెస్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ బిజినెస్, మేక్రో ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఆపరేషన్స్ రీసెర్చ్ ఫర్ ఫైనాన్స్ అండ్ రిస్క్ అనాలసిస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కంట్రోల్, ఎకనామెట్రిక్స్, డేటా మైనింగ్, సెక్యూరిటీ అనాలసిస్, కార్పొరేట్ ఫైనాన్స్, బ్యాంకింగ్, రెగ్యులేటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పర్సనల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఇన్వె్‌స్టమెంట్స్ కోర్సులు ఉంటాయి.
రెండో ఏడాది ఫైనాన్స్ అండ్ మార్కెట్ రిస్క్ ఎన్విరాన్మెంట్, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ అనాలసిస్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం, బిజినెస్ ఈ ఓరియంటేషన్, న్యూ ఫైనాన్షియల్ మోడల్స్, ఫైనాన్షియల్ రిస్క్ ఇంజనీరింగ్ ఫర్ డెసిషన్ మేకింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, పెన్షన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ తదితర కోర్సులు ఉంటాయి.
ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండస్ట్రియల్ ట్రెయినింగ్, సమ్మర్ ఇంటర్న్‌షిప్, లైవ్ ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ వర్క్‌లు, కేస్ స్టడీస్ నిర్వహిస్తారు.
అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు; కనీసం అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి 45 శాతం మార్కులు చాలు. క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ జీమ్యాట్/ జీఆర్ఈ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. ఇంజనీరింగ్/ టెక్నికల్/ సైన్స్ విభాగాల్లో 75 శాతానికి; కామర్స్/ ఆర్ట్స్ విభాగాల్లో 65 శాతానికి మించిన మార్కులతో డిగ్రీ/ పీజీ పూర్తిచేసినవారిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ముఖ్య సమాచారం
ప్రోగ్రామ్ ఫీజు: రూ.3,60,000
దరఖాస్తు ఫీజు: రూ.1250
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25
ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 1 నుంచి
వెబ్సైట్: www.iif.edu