Education-Article
ఐఐటీ కాన్పూర్‌లో ఎంబీఏ... క్యాట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా...!

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీకే) ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండేళ్ల వ్యవధిగల ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌. ఇందులో మొత్తం 78 సీట్లు ఉన్నాయి. క్యాట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.

స్పెషలైజేషన్‌లు: మాన్యుఫాక్చరింగ్‌ మేనేజ్‌మెంట్‌, సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌, సిస్టమ్స్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌

ప్రోగ్రామ్‌ వివరాలు: ఇందులో నాలుగు సెమిస్టర్‌లు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా కంపల్సరీ కోర్సులు, ఎలక్టివ్‌ కోర్సులు, సమ్మర్‌ అండ్‌ వింటర్‌ ఇంటర్న్‌షి‌ప్‌లు, క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ ఉంటాయి. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఎకనామిక్‌ అనాలసిస్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌ ఫర్‌ డెసిషన్‌ మేకింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, సోషియో - పొలిటికల్‌ అండ్‌ ఎథికల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ వంటి కోర్‌ కోర్సులు చదవాల్సి ఉంటుంది.  కోర్‌ కోర్సులకు 70, స్పెషలైజేషన్‌ కోర్సులకు 110, క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌కు 36 చొప్పున మొత్తం 216 క్రెడిట్స్‌ నిర్దేశించారు.

అర్హత వివరాలు: ఐఐటీ/ ఐఐఐటీ/ నిట్‌ సంస్థలు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్‌ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీతోపాటు ఎంఏ ఎకనామిక్స్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు కూడా అర్హులే. పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ స్థాయుల్లో జనరల్‌ అభ్యర్థులకు కనీసం 65 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కు లు ఉండాలి. క్యాట్‌ 2021 ఎగ్జామ్‌లో జనరల్‌ అభ్యర్థులకు 85 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 75 శాతం మార్కులు ఉండాలి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31 

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఫిబ్రవరి 12

వెబ్‌సైట్‌: iitk.ac.in

Tags :