Education-Article
జనవరి 19 నుంచి నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌

న్యూఢిల్లీ, జనవరి 13: అండర్‌ గ్రాడ్యుయేట్‌ జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ తెలిపారు. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ఈ ప్రక్రియ నిర్వహిస్తుందని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. వైద్యులు కావాలనుకుంటోన్న విద్యార్థులు ఆ రంగంలో రాణించి, ‘సమాజ సేవే మన మతం’ అనే మంత్రంతో భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

Tags :