Education-Article
2023 మే నాటికి కొత్త పాఠ్య ప్రణాళిక! రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): 2023 మే నాటికి రాష్ట్రంలో కొత్త పాఠ్య ప్రణాళిక అమలులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో గురువారం జరిగిన వెబినార్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాఠ్యప్రణాళిక ఏలా ఉండాలి? అందుకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 2021-22 విద్యా సంవత్సరానికి అన్ని కోర్సులు కలిపి మొత్తం 2.5 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరారని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే... కోర్సుల్లో నూతనత్వం అవసరం అని వక్తలు అభిప్రాయపడ్డారు. కొత్త పాఠ్య ప్రణాళికను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖరారు చేసి, అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. కాగా, బ్రిటిష్‌ కౌన్సిల్‌, యూకే వర్సిటీల సహకారంతో కొత్త పాఠ్య ప్రణాళిక తయారు చేయించాలని  విద్యామండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించారు.

Tags :