Education-Article
ఐఐఐటీల్లో తరగతులు ఎప్పుడు ప్రారంభించేది సంక్రాంతి తర్వాత ప్రకటిస్తాం

ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి

అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ఐఐఐటీల్లో తరగతులు ఎప్పుడు ప్రారంభించేది సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి తెలిపారు. ఇటీవలే ఐఐఐటీల్లో ప్రవేశాలు ముగిశాయని, వారంతా సంక్రాంతి తర్వాత నేరుగా తరగతులు ప్రారంభమవుతాయా? ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయా? అని అడుగుతున్నారని చెప్పారు. అయితే విద్యార్థుల క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి తర్వాత కొవిడ్‌ పరిస్థితిని బట్టి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు

Tags :