Education-Article
South Eastern Railwayలో 21 ఖాళీలు

కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే(ఎ్‌సఈఆర్‌) స్పోర్ట్స్‌ కోటా పరిధిలో వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కబడ్డీ, స్విమ్మింగ్‌ తదితరాలు

అర్హత: ఇంటర్మీడియట్‌/డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ స్థాయిలో అర్హత సాధించాలి.

వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: సంబంధిత క్రీడ, అకడమిక్‌ విద్యను అనుసరించి 6, 7వ జాతీయ పేకమిషన్‌ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్పోర్ట్‌ నైపుణ్యాలకు 50 మార్కులు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 40 మార్కులు, అకడమిక్‌ క్వాలిఫికేషన్‌కు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బంగ్లా నెం.12ఏ, గార్డెన్‌ రీచ్‌, కోల్‌కతా-700043.

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 02

వెబ్‌సైట్‌: https://ser.indianrailways.gov.in/

Tags :