Education-Article
ఉదయ్‌పూర్‌ ఐఐఎంలో ఎంబీఏ, పీజీడీబీఏ

ఉదయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంయూ) - ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి.


ఎంబీఏ

ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇది ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. ఇందులో గ్లోబల్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కోదానిలో మూడు టర్మ్‌లు ఉంటాయి. 


గ్లోబల్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో అకౌంటింగ్‌ ఫర్‌ మేనేజర్స్‌, బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌, డిజిటల్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, లాజిస్టిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, లైవ్‌ ఎస్‌సీఎం ప్రాజెక్ట్‌, క్యాప్‌స్టోన్‌ సిమ్యులేషన్‌, ఎలక్టివ్‌ కోర్సులు ఉంటాయి. 


డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్‌,      సాల్వింగ్‌ బిజినెస్‌ ప్రాబ్లమ్స్‌(ప్రాజెక్ట్‌లు) కోర్సులు ఉంటాయి. 


ఎంపిక: జాతీయ పరీక్ష స్కోర్‌, పర్సనల్‌ ఇం టర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 2

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఫిబ్రవరి 12

ప్రోగ్రామ్‌ ప్రారంభం: ఏప్రిల్‌ 6 నుంచి

పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌

ఈ ప్రోగ్రామ్‌ని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించారు. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. దీనిని బ్లెండెడ్‌ విధానంలో నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం రోజుల్లో ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటా యి. ప్రతి వారాంతానికి ఆరు సెషన్స్‌ నిర్దేశించారు. ఒక్కో సెషన్‌ వ్యవధి 90 నిమిషాలు. ప్రోగ్రామ్‌లో నిర్దేశించిన మేరకు క్యాంపస్‌ మాడ్యూల్స్‌ నిర్వహిస్తారు. 


ఈ ప్రోగ్రామ్‌లో ఏడాదికి రెండు చొప్పున మొత్తం నాలుగు టర్మ్‌లు ఉంటాయి. మొదటి టర్మ్‌లో ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలసిస్‌, ఇండివిడ్యువల్‌ అండ్‌ గ్రూప్‌ డైనమిక్స్‌, మేనేజీరియల్‌ ఓరల్‌ కమ్యూనికేషన్‌, రిటెన్‌ మేనేజీరియల్‌ కమ్యూనికేషన్‌, మైక్రో ఎకనామిక్స్‌ ఫర్‌ మేనేజర్స్‌, స్ర్పెడ్‌ షీట్‌ మోడలింగ్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా మైనింగ్‌-1 కోర్సులు ఉంటాయి. రెండో టర్మ్‌లో డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ మేనేజర్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా మైనింగ్‌-2, కార్పొరేట్‌ ఫైనాన్స్‌-1, కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మైక్రో ఎకనామిక్స్‌ ఫర్‌ మేనేజర్స్‌ కోర్సులు ఉంటాయి. మూడో టర్మ్‌లో స్ట్రాటజిక్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ డైనమిక్స్‌, డిజైన్‌ థింకింగ్‌, లీగల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ బిజినెస్‌, స్ర్పెడ్‌ షీట్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌-2, బిజినెస్‌ ఎథిక్స్‌, ఒక ఎలక్టివ్‌ కోర్సు ఉంటాయి. నాలుగో టర్మ్‌లో హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌, రెండు ఎలక్టివ్‌ కోర్సులు, క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ ఉంటాయి. 


ఎలక్టివ్‌ కోర్సులు: సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఫోర్‌క్యాస్టింగ్‌, నెగోషియేషన్స్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, బీ2బీ మార్కెటింగ్‌ కోర్సుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకోవాలి.


ఎంపిక: జాతీయ పరీక్ష స్కోర్‌ లేదా సంస్థ నిర్వహించే అడ్మిషన్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

అడ్మిషన్‌ టెస్ట్‌: దీనిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్‌ అంశాలకు సంబంధించి ఒక్కోదానిలో 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం రెండు గంటలు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28 సంస్థ నిర్వహించే టెస్ట్‌ రాయదలచుకొన్నవారు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఐఐఎంయూ టెస్ట్‌ తేదీ: జనవరి 30

ఫలితాలు విడుదల: మార్చి 20

ప్రోగ్రామ్‌ ప్రారంభం: జూన్‌ 4 నుంచి

దరఖాస్తు ఫీజు: రూ.1000,  

వెబ్‌సైట్‌: iimu.ac.in

Tags :