Education-Article
ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లీష్.. ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ..!

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- దూరవిద్య విధానంలో ఎంఏ ఇంగ్లీష్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. దీనిలో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయవచ్చు. కాంటాక్ట్‌ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. ప్రింట్‌, ఆడియో, వీడియో, ఆన్‌లైన్‌ రిఫరెన్స్‌ మెటీరియల్‌ అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసైన్‌మెంట్‌లు పూర్తిచేయాలి. మొదటి ఏడాది పరీక్షలు పాసైతేనే రెండో ఏడాది ప్రవేశానికి అనుమతిస్తారు. అసైన్‌మెంట్‌లకు 25 శాతం, ఫైనల్‌ ఎగ్జామ్‌కు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 



ప్రోగ్రామ్‌ వివరాలు: ఏడాదికి నాలుగు చొప్పున మొత్తం ఎనిమిది కోర్సులు ఉంటాయి. ఒక్కో కోర్సుకు ఎనిమిది క్రెడిట్స్‌ నిర్దేశించారు. ప్రోగ్రామ్‌ మొత్తానికి 64 క్రెడిట్స్‌ ఉంటాయి. మొదటి ఏడాది అకడమిక్‌ రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌, ఇంట్రడక్షన్‌ టు లింగ్విస్టిక్స్‌, బ్రిటిష్‌ లిటరేచర్‌-1, బ్రిటిష్‌ లిటరేచర్‌-2 అనే కంపల్సరీ కోర్సులు చదవాల్సి ఉంటుంది. రెండో ఏడాది సెకండ్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌, లిటరరీ క్రిటిసిజం అండ్‌ థియరీ అనే కంపల్సరీ కోర్సులు ఉంటాయి. ఆప్షనల్‌ కోర్సుల కింద అమెరికన్‌ పొయెట్రీ అండ్‌ డ్రామా, అమెరికన్‌ ఫిక్షన్‌, ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్‌, పోస్ట్‌కొలోనియల్‌ లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లీష్‌  కోర్సుల నుంచి రెంటిని ఎంచుకోవాలి.  
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆంగ్ల మాధ్యమంలో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు. ఎటువంటి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ లేదు. దరఖాస్తులు పరిశీలించి అడ్మిషన్‌ ఖరారు చేస్తారు. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు + ప్రోగ్రామ్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.6,160; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,740; దివ్యాంగులకు రూ.1,320
చేరేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
చిరునామా: డీన్‌, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ - 500007
ఈ మెయిల్‌: [email protected]
వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in
Tags :