Education-Article
జెఈఈ, నీట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, 7–10 తరగతుల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌ పరీక్ష

ప్రోడిజీ నాల్గవ ఎడిషన్‌ ప్రకటించిన అన్‌అకాడమీ

ప్రోడిజి ద్వారా అన్‌అకాడమీ ఇప్పుడు  టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌ను అందించనుంది.

అభ్యాసకులు ఉత్సాహపూరితమైన రివార్డులను గెలుచుకోవడంతో పాటుగా 100% స్కాలర్‌షిప్‌లను అన్‌అకాడమీ సబ్‌స్ర్కిప్షన్స్‌ కోసం అందుకోగలరు.


జనవరి 13, 2021: భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు తమ నాల్గవ ఎడిషన్‌ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్‌ పరీక్ష – అన్‌అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, 7నుంచి 10 వ తరగతి అభ్యాసకులకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌ను తమ అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం అందుకునే అవకాశంతో పాటుగా ఉత్సాహపూరితమైన రివార్డులను సైతం అందుకునే అవకాశం ఉంది. రేపటి తరపు మేధావులకు మద్దతునందించే రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. స్కాలర్‌షిప్‌ పరీక్షలను ఈ నెల 23, 29, ఫిబ్రవరి 6, 13 తేదీలలో నిర్వహించనుంది. 60 నిమిషాల వ్యవధి కలిగిన ఈ ప్రశ్నాపత్రంలో అప్టిట్యూడ్‌, వెర్బల్‌ సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌, సాధారణ సైన్స్‌కు సంబంధించి 35 ప్రశ్నలుంటాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై అందించిన  వీడియో పరిష్కారాల ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం ఈ లింక్‌లో https://unacademy.com/scholarship/prodigy2022 చూడవచ్చు.

Tags :