Education-Article
బడిఈడు పిల్లలను చదువుకు దూరం చేయొద్దు

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు శోభారాణి 


భూపాలపల్లిటౌన్‌, జనవరి 10: బడిఈడు పిల్లలను చదువుకు దూరం చేయొద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు శోభారాణి అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లోని సంచార జాతి పెద్దమ్మల సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఆమె కలిశారు. వారి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకరిద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించారు. పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందించాలని, బడిఈడు వచ్చాక తప్పనిసరిగా బడికి పంపించాలని సూచించారు. పిల్లలతో భిక్షాటన చేయించొద్దన్నారు. తమకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు ఉన్నప్పటికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయడం లేదనే విషయాన్ని పెద్దమ్మల సామాజిక వర్గానికి చెందిన వారు దృష్టికి తీసుకురాగా తహసీల్దార్‌ ఇక్బాల్‌ స్పందించారు. తహసీల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ శ్రీదాస్యం వేణుగోపాల్‌, డీడబ్ల్యూవో శామ్యూల్‌, బీఆర్‌బీ కోఆర్డినేటర్‌ శిరీష, సీడీపీవో అవంతిక, సీఐ మోహన్‌, డీసీపీవో హరికృష్ణ, ఆపరేషన్‌ స్మైల్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి వెంకటస్వామి, ఎస్సై ఊర్మిళ, ఆర్‌ఐ సునిల్‌, అంగన్‌వాడీ టీచర్లు పుష్పలత, శోభారాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సఖి సిబ్బంది పాల్గొన్నారు.

Tags :