Education-Article
అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి

నల్లగొండ టౌన్‌, జనవరి 10: కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లల హాజరుశాతం తగ్గుతోందని అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు సోమవారం వినతిపత్రం అందజే శారు. కరోనాతో మృతిచెందిన అంగన్‌వాడీ టీచర్ల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2018నుంచి అంగన్‌వాడీ సెంటర్ల అద్దెలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, అద్దంకి నర్సింహ, ఆర్‌. మంజుల, కె. విజయలక్ష్మి, ప్రమీల, బొంత రేణుక, ప్రకృతాంబ, లక్ష్మీ, మనిరూప, జానమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :