Education-Article
అందరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రాథమిక బాధ్యత కళాశాలలపై ఉంది

దివాన్‌చెరువు, జనవరి 10: అందరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రాథమిక బాధ్యత కళాశాలలపై ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. నన్నయ వర్సిటీ అఫిలియేటడ్‌ యూజీ, ిపీజీ కళాశాలల మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం సోమ వారం యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీసీ జగన్నాథరావు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిపాలనా భవనానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును, సైన్స్‌ కళాశాల బ్లాక్‌కు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు పేరును పెట్టేందుకు ఈసీలో అనుమతి లభించిందని తెలిపారు.   అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గంధం నారాయణరావు, జాయింట్‌ సెక్రటరీగా మహ్మద్‌ అబీబ్‌బాషా, ఈసీ సభ్యులుగా జి.గౌతం, ఏబీ నాయుడు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ఏపీ రాష్ట్ర ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల అసో సియేషన్‌ కార్యదర్శి జె.రమణ్‌జీ, నన్నయ వర్సిటీ అఫి లియేటెడ్‌ యూజీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, అధ్యక్షుడు కె.నరసింహారావు, ఉపాధ్యక్షులు తోటవాసు, బ్రహ్మజీ పాల్గొన్నారు.

Tags :