Education-Article
ఉద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే

కమ్మర్‌పల్లి, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి బదిలీ ప్రక్రియలో భాగంగా మనస్తాపానికి గురై అత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం కమ్మర్‌పల్లి మీదుగా భీమ్‌గల్‌ వైపు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ విప్‌ ఈరవత్రి అనీల్‌ను హసాకొత్తూర్‌ మారుతినగర్‌ కాలనీ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగలకు సమస్యలు తెచ్చిపెడుతోందని, ఈ కారణంగానే ఉద్యోగులు మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు.


రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుకు సంబురాలా? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుకు, గుండెలు ఆగి చనిపోతున్నందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రైతుబంధు సంబురాలు చేసుకుంటున్నారా అని టీపీసీసీ అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, కైలాష్‌ నేత, చారుగొండ వెంకటేశ్‌, కాల్వ సుజాతలు ప్రశ్నించారు. గాంధీభవన్‌లో వారు మా ట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని  మండిపడ్డారు. 

Tags :