Education-Article
Bank of Barodaలో పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 105

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌: 58

పోస్టులు: హెడ్‌వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ రిసెర్చ్‌ మేనేజర్‌, పోర్ట్‌ఫోలియో రిసెర్చ్‌ అనలిస్ట్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, ట్రేడ్‌ రెగ్యులేషన్‌, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌, ప్రొడక్ట్‌ హెడ్‌, ప్రైవేట్‌ బ్యాంకర్‌

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

అగ్రి బ్యాంకింగ్‌ విభాగం: 47

పోస్టు: అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల ఫుల్‌టైం పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/

Tags :