Education-Article
AP Model‌ Schoolలో పోస్టులు

విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్‌ స్కూల్‌ సొసైటీ (ఏపీఎంఎస్‌) రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన టీచర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 282

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ):71

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఇస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.28,940 చెల్లిస్తారు

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ):211

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఇస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.31,460 చెల్లిస్తారు

ఎంపిక విధానం: బ్యాచిలర్స్‌, పీజీ డిగ్రీల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, బీఈడీ మెథడాలజీలో వచ్చిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 07

వెబ్‌సైట్‌: https://nadunedu.se.ap.gov.in/ STMSWorks/Application/Guest_Registration.aspx

Tags :