Education-Article
TMCలో 175 నర్సు పోస్టులు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌/పండిట్‌ మదన్‌ మోహన్‌ మాళవీయ క్యాన్సర్‌ సెంటర్లలో నర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


అర్హత: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం)/డిప్లొమా ఇన్‌ అంకాలజీ/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.44,900 నుంచి రూ.53,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలలైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 08

దరఖాస్తు హార్డ్‌కాపీ పంపడానికి చివరి తేదీ: జనవరి 15

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=9111

Tags :