Education-Article
BELలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), మచిలీపట్నం(ఏపీ) యూనిట్‌ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 15

విభాగాల వారీగా ఖాళీలు: ఎలకా్ట్రనిక్స్‌-06, మెకానికల్‌-06, కంప్యూటర్‌ సైన్స్‌-03

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 నవంబరు 01 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.35,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: అర్హత పరీక్ష(బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, వైవా వాయిస్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌కు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 24

చిరునామా: మేనేజర్‌(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌, రవీంధ్రనాథ్‌ టాగోర్‌ రోడ్‌, మచిలీపట్నం - 521001, ఆంధ్రప్రదేశ్‌.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Tags :