Education-Article
ఆర్టీసీ నుంచి జీతభత్యాలు తీసుకోను: Bajireddy

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌ఆర్టీసీ నుంచి తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రకటించారు. ఎమ్మెల్యేగా వస్తున్న జీతభత్యాలు తనకు చాలని, తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఆర్థికభారం మోపడం ఇష్టంలేక తనవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. టీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.బాబు, కె.రాజిరెడ్డి చైర్మన్‌ నిర్ణయం పట్ల అభినందనలు తెలిపారు.  

Tags :