Education-Article
30 నుంచి డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు

రాష్ట్రంలో మిగిలిపోయిన డిగ్రీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్లను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం దోస్త్‌ ద్వారా సీట్లను కేటాయించారు. సుమారు 38,441 మంది విద్యార్థులకు ఈ సీట్లను  కేటాయించారు. వీరు 26లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ను చేయాల్సి ఉంది. లేని పక్షంలో సీటు రద్దుకానుందని ప్రకటించారు. ఒకే కాలేజీలోని ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి మారడానికి ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అకవాశం ఇస్తున్నట్టు వెల్లడించారు.

Tags :