Education-Article
26 నుంచి Law Admissions

ఈ నెల 26 నుంచి లా కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించనున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు బుధవారం ప్రకటించారు. ఐదేళ్లు, మూడేళ్ల లా కోర్సుల సీట్ల భర్తీ కోసం 26న నోటిఫికే షన్‌ను జారీ చేయనున్నామన్నారు. 27 నుంచి డిసెంబరు 6 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఎన్‌సీసీ, పీహెచ్‌ వంటి ప్రత్యేక కేటగిరి అభ్యర్థులు డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ను చేయించుకోవాలని,  11 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబరు 17న సీట్ల కేటాయింపులను చేయనున్నారు.  

Tags :