Education-Article
Transco తాత్కాలిక ఉద్యోగుల వేతనాల పెంపు

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తాత్కాలిక కంటింజెంట్‌ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకుంది. వారి వేతనాన్ని రూ.4000 నుంచి రూ.5200లకు పెంచారు. పెరిగిన వేతనాలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం జీవో జారీ చేశారు. తాత్కాలిక ఉద్యోగులు కావడంతో వీరు డీఏ, ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐ వంటి సౌకర్యాలు పొందడానికి అర్హులుకారు. 

Tags :