Education-Article
Symbiosisలో డిస్టెన్స్ కోర్సులు

పుణెలోని సింబయాసిస్‌ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌(ఎ్‌సడీడీఎల్‌)... 2022 జనవరిలో ప్రారంభం కానున్న వివిధ దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌,  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌, హ్యుమానిటీస్‌ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులన్నింటికీ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది.


కోర్సుల వివరాలు

పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌

కోర్సు వ్యవధి రెండేళ్లు. కంపల్సరీ కోర్సులు, స్పెషలైజేషన్ల కలబోతగా ఈ ప్రోగ్రామ్‌ని రూపొందించారు. మొదటి రెండు సెమిస్టర్లలో కోర్‌ సబ్జెక్టులనే బోధిస్తారు. మొత్తం నాలుగు సెమిస్టర్లు, 80 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. 

స్పెషలైజేషన్లు: హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, బిజినెస్‌ అండ్‌ కార్పొరేట్‌ లాస్‌, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ రైటింగ్‌ ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషనల్‌ అడ్మినిస్ట్రేషన్‌, స్కూల్‌ కౌన్సెలింగ్‌, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫిన్‌టెక్‌, సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పర్సనల్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, రిటెయిల్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌, ప్రీ ప్రైమరీ టీచర్స్‌ ట్రెయినింగ్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, డిజైన్‌ థింకింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్స్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


పీజీ సర్టికెట్‌ ప్రొగ్రామ్‌

కోర్సు వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు, 40 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో కాస్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, బడ్జెటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌, గ్రూప్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌, ప్రాజెక్ట్‌ ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ గురించిన సబ్జెక్టులు ఉంటాయి. ఇక రెండో సెమిస్టర్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, స్ట్రాటజిక్‌ ఫైనాన్స్‌, రీసెర్చ్‌ మెథడాలజీ తదితర అంశాలతోపాటు చివరగా ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటుంది.

స్పెషలైజేషన్లు: ఫైనాన్స్‌(మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌), మేనేజ్‌మెంట్‌(సైబర్‌లాస్‌), మేనేజ్‌మెంట్‌ (ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌), ఫైనాన్స్‌(టాక్సేషన్‌ లాస్‌), మేనేజ్‌మెంట్‌(డిజిటల్‌ మార్కెటింగ్‌), మేనేజ్‌మెంట్‌(ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌)

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్స్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు

కోర్సు వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు, 30 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి.

స్పెషలైజేషన్లు: డిప్లొమా ఇన్‌ క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్‌, డిప్లొమా ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, బుద్ధాస్‌ టీచింగ్‌ అండ్‌ విపాసన, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టు మార్కెటింగ్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌, విర్చువల్‌ వర్క్‌ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌, ఏడబ్ల్యూఎస్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్చర్‌ తదితరాలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఇంగ్లీ్‌షలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇంగ్లీ్‌షలో 50 శాతం కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించిన డిప్లొమా హోల్డర్లు, బ్యాచిలర్స్‌ డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 15

వెబ్‌సైట్‌: www.scdl.net/

Tags :