Education-Article
IIM Bangaloreలో పీహెచ్‌డీ

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)... 2022 సెషన్‌కుగాను పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.


స్పెషలైజేషన్లు:

డెసిషిన్‌ సైన్సె్‌స: ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌: ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: మార్కెటింగ్‌, ఆరనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ: స్ట్రాటజీ తదితరాలు

కోర్సు వ్యవధి: రిజిస్ట్రేషన్‌ అయిననాటి నుంచి ఐదేళ్లలోపు పూర్తిచేయాలి.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ(బ్యాచిలర్స్‌ డిగ్రీని 10+2+3 విధానంలో పూర్తి చేసి ఉండాలి) ఉత్తీర్ణత. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ(ఇంటర్‌లో 10+2 విధానం) ఉత్తీర్ణత. బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి. సీఏ, ఐసీడబ్లూఏఐ వంటి ప్రొఫెషనల్‌ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస మార్కుల నిబంధనలో 5 శాతం మార్కుల సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: సంబంధిత విభాగం జాతీ య స్థాయి అర్హత పరీక్షల స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక్కో విభాగానికి ఒక్కో జాతీయ స్థాయి అర్హత పరీక్షను నిర్దేశించారు. కాబట్టి అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. స్కోరు లేని అభ్యర్థులు ఐఐఎంబి టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను బెంగళూరు, కాజిఖోడ్‌, కాశీపూర్‌లో నిర్వహిస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 19

ఐఐఎంబీ టెస్ట్‌: 2022 ఫిబ్రవరి 06

వెబ్‌సైట్‌: www.iimb.ac.in/programmes/doctoralprogramme/importantdatesadmission

Tags :