Education-Article
IOPBలో డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ - డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫిజిక్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు కోర్సు ప్రారంభ సమయానికి సంబంధిత సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. సీఎ్‌సఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అర్హత పొంది ఉండాలి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ 200 లోపు ఉన్నవారు, జెస్ట్‌ 2021 స్కోర్‌ 250 లోపు ఉన్నవారు కూడా అర్హులే. 


దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 5

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: డిసెంబరు 13 నుంచి 17 వరకు

వెబ్‌సైట్‌: http://iopb.res.in

Tags :