Education-Article
RCIలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌

భారత ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిహెబిలిటేషన్‌  కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) - డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


కోర్సులు: డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఐడీడీ/ హెచ్‌ఐ/ వీఐ/ ఎండీ), డీఐఎ్‌సఎల్‌ఐ, డీటీఐఎస్‌ఎల్‌ 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డీటీఐఎ్‌సఎల్‌ కోర్సుకు దివ్యాంగులు -డెఫ్‌ మాత్రమే అర్హులు. వీరికి 45 శాతం మార్కులు వస్తే చాలు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350; దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11

వెబ్‌సైట్‌: rehabcouncil.nic.in

Tags :