Education-Article
IIPEలో బీటెక్‌, పీహెచ్‌డీ

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) - బీటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 


బీటెక్‌

కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో పెట్రోలియం ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలను ఎంచుకోవచ్చు. ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌/ తత్సమాన పరీక్షలో సాధించిన మార్కులు, జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2021 స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2021 అర్హత తప్పనిసరి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10

ఫస్ట్‌ రౌండ్‌ సీట్ల అలాట్‌మెంట్‌ లిస్ట్‌ విడుదల: నవంబరు 11

సెకండ్‌ రౌండ్‌ రిజల్ట్‌: నవంబరు 16

థర్డ్‌ రౌండ్‌ రిజల్ట్‌: నవంబరు 20

ఫోర్త్‌ రౌండ్‌ రిజల్ట్‌: నవంబరు 25

కోర్సు రిజిస్ట్రేన్‌: డిసెంబరు 3 నుంచి 5 వరకు 

అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం: డిసెంబరు 13 నుంచి


పీహెచ్‌డీ

ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో పూర్తిచేయవచ్చు. ఇందులో బయాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎర్త్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా కోర్సు వర్క్‌, పబ్లికేషన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ వర్క్‌, సెమినార్‌లు, కాంప్రహెన్సివ్‌ ఎగ్జామినేషన్‌, వైవా, అవార్డ్‌ ఆఫ్‌ పేటెంట్స్‌ ఉంటాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ డ్యూయెల్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, కోల్‌, ఎర్త్‌ సైన్సెస్‌, కెమికల్‌ అండ్‌ ఫర్టిలైజర్‌, డిఫెన్స్‌ సంస్థల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ సంస్థలనుంచి కనీసం 8 సీజీపీఏతో బీటెక్‌/ డ్యూయెల్‌ డిగ్రీ - బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌ / అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ జామ్‌ స్కోర్‌తో రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తిచేసినవారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. 


ముఖ్య సమాచారం

రీసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌: అయిదేళ్లపాటు ఈ సౌకర్యం లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; తరవాత మూడేళ్లు నెలకు రూ.35,000 చెల్లిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు. 

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.300; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 15

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: 2022 జనవరి 17 నుంచి 19 వరకు

ఎంపికైన అభ్యర్థుల జాబితావిడుదల: 2022 జనవరి 24

పీహెచ్‌డీ అడ్మిషన్‌ తేదీ: 2022 ఫిబ్రవరి 1

వెబ్‌సైట్‌: ipe.ac.in

Tags :