Education-Article
RGIPTలో బీటెక్‌, ఐడీడీ

అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)- బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయెల్‌ డిగ్రీ(ఐడీడీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2021 స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. బీటెక్‌ వ్యవధి నాలుగేళ్లు. ఐడీడీ వ్యవధి అయిదేళ్లు. ఇందులో బీటెక్‌, ఎంటెక్‌ డిగ్రీలు పొందవచ్చు.  ఈ ప్రోగ్రామ్‌లలో భాగంగా 16 వారాల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌ కింద ఎంపిక చేసిన అభ్యర్థులకు 25 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. 


బీటెక్‌ స్పెషలైజేషన్‌లు - సీట్లు

కెమికల్‌ ఇంజనీరింగ్‌  60, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 60, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌ 60, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ 30, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 60, మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ 50, పెట్రోలియం ఇంజనీరింగ్‌ 60, రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇంజనీరింగ్‌ 30 సీట్లు ఉన్నాయి.


ఐడీడీ స్పెషలైజేషన్‌లు - సీట్లు

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 40,  జియో సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఫిజికల్‌ టెక్నాలజీ / జియోలాజికల్‌ టెక్నాలజీ 30 సీట్లు ఉన్నాయి. 


అర్హత

గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ)/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 26

ఫస్ట్‌ రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: అక్టోబరు 28

సెకండ్‌ రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: నవంబరు 9

థర్డ్‌ రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: నవంబరు 17

కోర్సు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబరు 30

ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌: డిసెంబరు 1 నుంచి 3 వరకు

అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం: డిసెంబరు 6 నుంచి

వెబ్‌సైట్‌: rgipt.ac.in


Tags :