Education-Article
‘JEE’లో మైనారిటీ గురుకులాల హవా

జేఈఈ అడ్వాన్స్‌లో తెలంగాణ మైనార్టీ గురుకుల జూనియర్‌ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని కార్యదర్శి షఫియుల్లా తెలిపారు.ఆ పరీక్షలో ఆర్‌.రంజిత్‌ నాయక్‌ 661, మహమ్మద్‌ జునైద్‌ 4,106 ర్యాంకు సాధించారని ఒక ప్రకటనలో చెప్పారు. బార్క్‌సలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో విద్యార్థులకు శిక్షణ అందించామన్నారు. ప్రతిభ కనబర్చిన విదార్థులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ అభినందించారు.

Tags :