Education-Article
హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఈ నెల 21

హైదరాబాద్ సిటీ: రాజేంద్రనగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ ఎర్ర అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, బాటనీ, జువాలజీ సబ్జెక్టులలో గెస్ట్‌ లెక్చరర్లుగా చేరాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉండాలన్నారు. అగ్రికల్చరల్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌(ఏసీపీ) ఒకేషనల్‌ కోర్సులో గెస్ట్‌ లెక్చరర్‌గా చేరాలనుకునే వారు బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 21లోగా రాజేంద్రనగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు పంపాలన్నారు. వివరాలకు ఎర్ర అంజయ్య, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాజేంద్రనగర్‌, లేదా 9701188901 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.


రాయదుర్గం జూనియర్‌ కళాశాలలో..

రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులలో గెస్ట్‌ లెక్చరర్లను నియమించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తెలిపారు. మ్యాథమెటిక్స్‌,(జనరల్‌), ఎకనమిక్స్‌(జనరల్‌), కంప్యూటర్‌ సైన్స్‌(ఒకేషనల్‌) సబ్జెక్టులకు ఖాళీలు ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో(జనరల్‌ పోస్టులకు) పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(ఎమ్మెస్సీ, ఎంఏ) పాస్‌ అయి ఉండాలి, ఒకేషనల్‌ పోస్టుకు ఎంసీఏ, బీటెక్‌(సీఎ్‌సఈ) పాస్‌ అయి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Tags :