Education-Article
L&T సీఎస్‌టీఐ ట్రెయినింగ్‌

ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌ స్కిల్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో నిర్మాణ నైపుణ్యాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సమీపంలో నిర్దేశిత ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.  


శిక్షణ అంశాలు: ఫార్మ్‌ వర్క్‌ వడ్రంగి, బార్‌ బెండింగ్‌ అండ్‌ స్టీల్‌ ఫిక్సింగ్‌, తాపీ పని, కన్‌స్ట్రక్షన్‌ ఎలక్ట్రీషియన్‌, వెల్డింగ్‌.

శిక్షణ వ్యవధి: వెల్డింగ్‌కు 60; మిగిలిన అన్నింటికీ 90 రోజులు. 

అర్హత: దరఖాస్తు నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అభ్యర్థులు కనీసం 155 సెం.మీల ఎత్తు, కనీసం 45 కేజీల బరువు ఉండాలి. అయిదో తరగతి ఉత్తీర్ణత చాలు. ఎలక్ట్రీషియన్‌, వెల్డింగ్‌ అండ్‌ ప్లంబింగ్‌ ట్రేడ్‌లలో ఐటీఐ చేసినవారు సంబంధిత శిక్షణకు అప్లయ్‌ చేసుకోవచ్చు.   

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30


Tags :