Education-Article
JEE Advancedల్లో ‘నారాయణ’ ముందంజ

నాలుగు జాతీయ ర్యాంకులు సాధించాం: సంస్థ డైరెక్టర్లు


హైదరాబాద్‌,  అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ముందంజలో ఉన్నారని, జాతీయ స్థాయిలో నాలుగు ర్యాంకులు సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల్లో పల్లె భావన అనే విద్యార్థిని సౌతిండియా స్థాయిలో  ఫస్ట్‌ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఓపెన్‌ కేటగిరిలో ఆలిండియా టాప్‌ 10లోని 1, 4, 6, 9 ర్యాంకులను నారాయణ సంస్థ విద్యార్థులు సాధించినట్లు వారు వెల్లడించారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ.. తమ సంస్థ చేపట్టిన ప్రత్యేక విధానం, అత్యుత్తమ విద్యాబోధన కారణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మైక్రో షెడ్యూల్స్‌, వీక్లీ టెస్ట్‌ల నిర్వహణలో ప్రత్యేక మార్పులతో బోధన అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అఽధ్యాపక బృందాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు ఈ సందర్భంగా అభినందించారు.

Tags :