Education-Article
Anna Universityలో ఎమ్మెస్సీ

చెన్నైలోని అన్నా యూనివర్సిటీ - ఎమ్మెస్సీ ఇన్‌ మల్టీమీడియా ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రధాన స్పెషలైజేషన్‌ ‘విజువల్‌ కమ్యూనికేషన్‌’. ఇందులో నాలుగు సెమిస్టర్‌లు ఉంటాయి. ఇది ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌.  సైన్స్‌/ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవచ్చు. మీడియా కంపోనెంట్‌తో డిగ్రీ చేసినవారు కూడా అర్హులే.  అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.700. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 1 

వెబ్‌సైట్‌: annauniv.edu

Tags :